చైనా జీరో కొవిడ్ విధానంపై ఆ దేశ పౌరుల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో ఆంక్షలు సడలించాలని డ్రాగన్ సర్కారు చూస్తోంది. ఆ దేశం జీరో కొవిడ్ విధానాన్ని సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జీరో-కొవిడ్ పాలసీని ఎత్తేస్తే లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని పరిశోధకులు చెబుతున్నారు.