డ్రాగన్ దేశంలో జీరో కొవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేయడంపై మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి. దేశంలోని బీజింగ్ సహా పలు నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. దేశమంతటా దాదాపు 40,000 కొత్త కొవిడ్ కేసులు నమోదవడంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ దేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జిన్‌పింగ్ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. జిన్‌పింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చైనాలోని హైడియన్ జిల్లాలో బ్యానర్లు వెలిశాయి.