Pakistan: పాకిస్తాన్‌లోకి చైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు రంగ ప్రవేశం చేశాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా చైనా జాతీయులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) వంటి ప్రాజెక్టులలో పనిచేస్తున్న తన జాతీయుల భద్రతను నిర్ధారించడానికి చైనా ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది.