Gaza: ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గాజాపై చేసిన ప్రకటన సంచలనంగా మారింది. గాజాలోని పాలస్తీనియన్లను ఇతర అరబ్ దేశాలు తీసుకోవాలని సూచించారు. పాలస్తీనియన్లకు జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు ఆశ్రయం కల్పించాలని లేదంటే సాయం నిలిపేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పాలస్తీనియన్లు ఖాళీ చేసిన తర్వాతే గాజాని స్వాధీనం చేసుకుంటామని, అప్పుడు మాత్రమే గాజా పునర్ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. గాజాపై తన ప్రతిపాదన గురించి జోర్డాన్ రాజుతో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ప్రతిపాదనని జోర్డాన్ తోసిపుచ్చింది.…