China Statement Nepal Crisis: నేపాల్‌లో కొనసాగుతున్న గందరగోళం, తిరుగుబాటుపై చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లోని అన్ని పార్టీలు సమిష్టిగా ఉండి.. దేశీయ సమస్యలను పరిష్కరించుకోవాలని, సామాజిక క్రమం, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని చైనా కోరింది. నేపాల్ పరిస్థితిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తొలిసారి మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "చైనా, నేపాల్ దేశాలు సాంప్రదాయక, స్నేహపూర్వక పొరుగు సంబంధాలను కలిగి ఉన్నాయి.