ధైర్యవంతులైన విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం విడుదల చేశారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు రాగానే.. జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ విడుదల చేశారు.
ఇథియోపియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు పెద్ద ఎత్తున బురద జలాలు ఏరులైపారడంతో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది పలువుర్ని కాపాడారు.
చిన్న పిల్లలు నవ్వినప్పుడు, ఆడినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వారి ఆకస్మిక దూకుడు కార్యకలాపాలు కోపం తెప్పిస్తాయి. అయినప్పటికీ, వారు చేసే ఈ దూకుడు కార్యకలాపాల వెనుక చాలా కారణాలు ఉండవచ్చు.
యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
చదివినవి బాగా గుర్తు పెట్టుకుంటే పరీక్షలు రాయొచ్చు. పిల్లలకు చదివినవి సరిగా గుర్తుండవు, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయి. ఇందుకోసం వారికి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వాలి.
పంచదార అన్న పదం వినగానే నోట్లో నీళ్ళూరుతాయి. ముఖ్యంగా చిన్నతనంలో పంచదారను ఎక్కువగా తింటుంటాం. అయితే, చిన్నతనంలో ఇలా చక్కెర, కొవ్వు పదార్థాలు తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు సాధారణంగా తీపి పదార్ధాల రుచిని ఇష్టపడతారు. కానీ చిన్న పిల్లలకు చక్కెర ఇవ్వడం వారి ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువుకట్ట పై నుంచి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.