Cough Syrup: రాజస్థాన్‌లో దగ్గు సిరప్ తీసుకున్న పిల్లల ఆరోగ్యం క్షీణిస్తోంది. సికార్‌లో ఐదేళ్ల చిన్నారి మరణించింది. ఆ సిరప్ తీసుకున్న వెంటనే ఆ చిన్నారి శ్వాస ఆగిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైపూర్‌లో ఇలాంటి కేసు వెలుగులోకి రాగా, శ్రీమధోపూర్, భరత్‌పూర్‌లలో కూడా సంఘటనలు నమోదయ్యాయి. జైపూర్‌లో అదే మందు తీసుకున్న రెండేళ్ల బాలికను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియులో చేర్చాల్సి వచ్చింది.