బాల కార్మికుల నిర్మూలన దిశగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లలోపున్న చిన్నారులతో ఎక్కడైనా పనిచేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలు శిక్షను విధిస్తామని తెలిపింది. అంతేకాకుండా రూ.20 వేల నుంచి 50 వేల వరకు జరిమానా విధంచే అవకాశం కూడా ఉన్నట్టు తెలంగాణ సర్కార్ తెలియజేసింది. బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలన, పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు సర్కార్ ప్రకటించింది.…