Karnataka: కర్ణాటకలోని చిక్కమగళూర్‌లో జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త మరణించడం, ఆ రాష్ట్రంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జిల్లాలోని రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో కాంగ్రెస్ కార్యకర్త, గ్రామ పంచాయతీ సభ్యుడు మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.