ఏపీ కౌన్సిల్ జరుగుతున్న తీరుపై విపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. కల్తీసారా వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోంది.రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యంతో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు మా దగ్గర ఉన్నాయి. కొన్ని రసాయనాలు సైనేడ్ గా మారొచ్చనే అధ్యయనాలు ఉన్నాయి. ఇవన్నీ బయటకొస్తాయనే మమ్మల్ని దూషించి చర్చ నుంచి పారిపోతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించమంటే స్పీకర్ మార్షల్స్ ని రమ్మంటున్నారు. మంత్రులు బొత్స, కొడాలినాని తరహాలో మా సభ్యులు ఎవ్వరూ ప్రవర్తించట్లేదు. కౌన్సిల్ ఛైర్మన్ గా…