తెలుగునాట జానపద చిత్రాలు అనగానే ముందుగా స్ఫురించే పేరు నటరత్న యన్.టి.రామారావుదే! ఆ తరువాతే ఎవరి పేరైనా గుర్తుకు వస్తుంది. యన్టీఆర్ తరువాత ఎక్కువ జానపద చిత్రాలలో హీరోగా నటించిన ఘనత కాంతారావుదే! వారిద్దరూ కలసి అనేక జానపద చిత్రాలలో నటించారు. ఇక కాంతారావు సైతం జానపద కథానాయకునిగా ఊపుమీదున్న రోజుల్లో ఆయన యన్టీఆర్ తో కలసి సమానస్థాయిలో నటించిన జానపదం ‘చిక్కడు-దొరకడు’ అనే చెప్పాలి. శ్రీలక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠలాచార్య దర్శకత్వంలో పొట్లూరి వెంకటనారాయణ, కుదరవల్లి…