Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సుక్మా సరిహద్దు ప్రాంతంలోని తుమ్కాపాల్, డబ్బా కున్నా గ్రామాల మధ్య అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు.
మావోయిస్టులు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.
ఛత్తీస్గడ్ సరిహద్దులో మరోసారి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. ఆశీర్గూడ సమీపంలోని 30వ జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సుతో సహా మూడు భారీ వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు నిర్వహించారు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా crpf బలగాలు ఇంజరంకుం తరలించారు. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా సుక్మా కొంట…
P Chidambaram React on Congress to lose in the Assembly Elections: ఇటీవల ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని తాము ఊహించలేదని ఆ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విజయం సాధించడం బీజేపీలో ఉత్సాహం నింపిందన్నారు. మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదరలేదని చిదంబరం పేర్కొన్నారు. ప్రతి…
Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. బుధవారం రాయ్‌పూర్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సాయ్ ప్రమాణస్వీకారం జరిగింది. ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
Road Accident: ఎన్నో కలలతో వివాహంతో ఓకమైన కొత్త జంటను రోడ్డు ప్రమాదం కబళించింది. వధూవరులతో సహా ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకుంది. జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ట్రక్కు, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్‌ని బీజేపీ ఖరారు చేసినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ని బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఈ రోజు బీజేపీ కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన సర్బానంద సోనావాల్, అర్జున్ ముండాలు సీఎంను ఖరారు చేశారు. మొత్తం 90 అసెంబ్లీలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 54 స్థానాల్లో బీజేపీ గెలిచింది.
Chhattisgarh: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ తెలంగాణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌కి భిన్నంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 54 స్థానాలను గెలుచుకుంది, కాంగ్రెస్ అధికారం కోల్పోయి 35 స్థానాల్లో మాత్రమే గెలిచింది.
Lowest Victory Margin in Chhattisgarh Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలుబడిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో 90 సీట్లు ఉండగా.. బీజేపీ ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. మునుపెన్నడూ లేనంతగా బీజేపీ మెజార్టీని సొంతం చేసుకోగా.. గత నాలుగు ఎన్నికల్లో ఎన్నడూలేనంత తక్కువకు కాంగ్రెస్ సీట్లు పడిపోవడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లో కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. కేవలం 16 ఓట్ల తేడాతో కాంకేర్ కాంగ్రెస్ అభ్యర్థి…
PM Modi: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. చలి నెమ్మదిగా వస్తుందని, అయితే రాజకీయ వేడి వేగంగా పెరుగుతోందని ప్రధాని అన్నారు.