ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే కి సర్వం సిద్ధం అవుతోంది. జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు సన్నాహాలు చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర పచ్చని గడ్డి మొక్కలతో సీఎం జగన్ చిత్రం రూపకల్పన చేశారు. సీఎం జగన్ పై ప్రత్యేకంగా పాటలు సిద్ధం చేయించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పాటల వీడియో…
అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ మధ్య ఏపీలో రాజకీయ వైరం ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఇలాంటి సమయంలో తిరుపతి రాయల చెరువు దగ్గర ఆవిష్కృతమైన దృశ్యం.. ఆ ఎమ్మెల్యేను ఇరకాటంలోకి నెట్టింది. చేసింది నమస్కారంమైనా.. ఇది తమ సంస్కారమని చెప్పినా.. టైమింగే తేడా కొట్టిందట. ఇంకేముందీ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. సోషల్ మీడియాలో చెవిరెడ్డి వరద సాయం వీడియోలు..! తిరుపతి సమీపంలోని రాయల చెరువు లీకేజీ కారణంగా ఇరవైకి పైగా…
ఆయన విపక్షంలో ఉన్నప్పుడు మాటలు తూటాల్లా పేలేవి. ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నారు. ఉలుకు లేదు.. పలుకు లేదు. అంతా బీ.. కామ్. అనుచరులకు కూడా తమ నేతలో వచ్చిన మార్పు అర్థం కావడంలేదట. ఆయనకేమైంది? ఎవరా నాయకుడు? ఏమా కథ? కీలక అంశాలపై పెదవి విప్పని చెవిరెడ్డి! వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోందట. విపక్షపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ప్రతి అంశంలోనూ దూకుడు ప్రదర్శించిన ఆ చెవిరెడ్డి..…
ఆ ఎమ్మెల్యే ఏం చేసినా డిఫరెంట్. ఎప్పుడూ ప్రజల అటెన్షన్ కోసం చూస్తారు. ఆనందయ్య మందు విషయంలోనూ అదే చేశారు. ఆయన చేపట్టిన పనికి నియోజకవర్గంలో పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినా.. పబ్లిసిటీ మాత్రం తలనొప్పిగా మారిందట. అనుకున్నదొక్కటి.. జరుగుతున్నది ఇంకొకటి అనీ బాధపడుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఇరకాటంలోపడ్డ చెవిరెడ్డి సాధారణంగా రాజకీయ నాయకులకు ఆబ్లిగేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువ. వీటికీ ఒక లిమిట్ ఉంటుంది. ఆ…
చంద్రగిరి నియోజకవర్గం ప్రజలను కాపాడుకోవడం శాసనసభ్యునిగా నా భాధ్యత అని తెలిపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోవిడ్ భాధితులు కోసం చంద్రగిరిలో 100,నారావారిపల్లెలో 50 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసారు. అలాగే 500 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తూన్నాం అని తెలిపారు. ఆక్సిజన్ కోనుగోలుకు 20 లక్షలు, జర్నలిస్టు కోవిడ్ సంక్షేమ నిధికి లక్ష రూపాయల విరాళంగా అందిస్తూన్నా అని పేర్కొన్నారు. హోం ఐసులేషన్ లో వుండే వారికి 2500 రూపాయల విలువ చేసే…