Cheque Power : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల నిర్వహణలో కీలకమైన ఉప సర్పంచ్‌ల అధికారాలను ప్రభుత్వం తగ్గిస్తోందని, వారికున్న ‘చెక్ పవర్’ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, ప్రభుత్వం ఇప్పటి వరకు అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని పంచాయతీ రాజ్ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గ్రామాల్లో పాలనను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం వివిధ సంస్కరణలను ఆలోచిస్తున్నప్పటికీ, ఉప సర్పంచ్‌ల ఆర్థిక…