రసాయన ఆయుధాలతో భయాందోళనలు లేని ప్రపంచానికి ఒక అడుగు దగ్గరకు తీసుకువచ్చామని అమెరికా అధ్యక్షులు బిన్ జోబైడెన్ అన్నారు. రసాయన ఆయుధాల నిల్వలో ఉన్న చివరి మందుగుండు సామగ్రిని యునైటెడ్ స్టేట్స్ సురక్షితంగా నాశనం చేసిందని .. అందుకు తాను గర్వపడుతున్నానని బైడెన్ అన్నారు.
USA: మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల కన్వెన్షన్ ప్రకారం అమెరికా తన దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసిందని అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికా తన చివరి రసాయన ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసినందుకు గర్వపడుతున్నానని.. రసాయన ఆయుధాలు భయం లేని ప్రపంచానికి మమ్మల్ని ఒక అడుగు దగ్గర చేసిందని బైడెన్ చెప్పారు.