ప్రయాణికుల అవసరం.. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల అవకాశం.. వెరశి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొమురం భీం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు యాజమాన్యం మోసం బయటపడింది. పరిమితికి మించి ప్రయాణికులను బస్సు లో ఎక్కించడం తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి చెక్ పోస్ట్ వద్ద బస్సును రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి యూపీ, బీహార్ వెళ్లేందుకు ఒక ప్రైవేటుట్రావెల్స్ ద్వారా వెళుతున్న ప్రయాణికులు టికెట్ ధర…