విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డా.అలైదా గువేరా నేడు హైదరాబాద్ రానున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్టే ఫానియా గువేరా కూడా నగరానికి వస్తున్నారు. ఇవాళ (ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే 'క్యూబా సంఘీభావ సభ'కు అలైదా గువేరా, ఎస్టీ ఫానియా ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.