అనుకున్న మెజార్టీ రావడం లేదంటూ మునుగోడు బరిలో వున్న అభ్యర్థులు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అసహనం వ్యక్తం చేస్తూ కౌంటర్ సెంటర్ నుంచి వెళ్లిపోవడం చర్చకు దారితీస్తోంది.
నల్గొండ జిల్లా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదన్నారు. ఫలితం ఎలానైనా ఉండొచ్చన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ రంగంలోకి దిగింది. పంతంగి టోల్ గేట్ వద్ద తనికీలు నిర్వహించాగా.. 3.05 కేజీల బంగారం సీజ్ చేసారు అధికారులు.