ఇటీవలే తెలుగు నటి చౌరాసియాపై కేబీఆర్ పార్క్ వద్ద ఓ ఆగంతకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. కేబీఆర్ పార్క్‌లో ఎప్పటిలాగే వాకింగ్ కోసమని వెళ్లాలనని, పార్క్ నుంచి బయటకు వస్తుంటే ఓ వ్యక్తి తనపై దాడి చేశాడని నటి చౌరాసియా తెలియజేసింది. తన మొబైల్ ఫోన్, డైమండ్ రింగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో తన మొహంపై గుద్దాడని తెలిపింది. తన దగ్గర డబ్బులు లేవని, కావాలంటే ఫోన్‌పే చేస్తానని, నెంబర్ ఇవ్వమని అడిగినట్టు నటి…