Ramantapur Incident Ex-Gratia: హైదరాబాద్ రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల కారణంగా జరిగిన ఘోర విషాద ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకృష్ణుడి విగ్రహ శోభాయాత్రలో రథానికి విద్యుత్ తీగలు తాకడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలవిస్తున్నారు. మరోవైపు పరిస్థితి విషమంగా ఉన్న వారి కుటుంబ సభ్యులు…