నిజామాబాద్ పిఎఫ్ ఐ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి 11 మందిపై ఎన్ ఐ ఎ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆగస్టు 26న కేసు నమోదు చేసింది ఎన్ ఐ ఎ. స్పీచ్ ల ద్వారా యువకులను పిఎఫ్ఐ వైపు ఆకర్షితులను చేశారని ఎన్ఐఏ పేర్కొంది. పిఎఫ్ ఐలో చేరాక భారత ప్రభుత్వంపై కుట్ర కు శిక్షణ ఇచ్చారు. యువకులకు యోగ క్లాస్ పేరుతో నిందితుడు గౌస్ శిక్షణ ఇచ్చాడని ఎన్ఐఏ తెలిపింది. ఆయుధాలతో ఉగ్ర చర్యలకు పాల్పడేలా శిక్షణ ఇచ్చిన గౌస్ పై చర్యలు చేపడతామంటోంది ఎన్ఐఏ.
నిందితులపై ఐపిసి 120బి,153ఏ,తో పాటు ఉప్పా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ లో PFI పై నమోదైన కేసు ఆధారంగా NIa దర్యాప్తు చేపట్టింది. 11మంది నిందితులపై నేరారోపణలు మోపింది NIA. నిందితులపై 120B, 153 A, UA ( P) 17,18,18A, 18B సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీ కి చెందిన పలువురిపై అభియోగాలు మోపింది NIA. శిబిర నిర్వహికుడు అబ్దుల్ ఖాదర్ తో పాటు మరో 10 మందిపై ఛార్జ్ షీట్ వేసింది. ముస్లిం యువకులను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడినట్లు గుర్తించింది. భారత ప్రభుత్వము, ఇతర సంస్థలు, వ్యక్తులపై రెచ్చగొట్టే ప్రసంగాలు పిఎఫ్ఐ చేస్తున్నట్లు చార్జ్ షీట్ పేర్కొంది ఎన్ఐఏ.
Read Also: Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్లు జైలుశిక్ష!
రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ముస్లిం యువకులను పిఎఫ్ఐ సంస్థలో బలవంతంగా చేర్చుకున్నట్లు పేర్కొంది NIA. PFIలో రిక్రూట్ అయిన తర్వాత, ముస్లిం యువకులను యోగా క్లాసులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ , బిగినర్స్ కోర్సు ముసుగులో దాడులు పై శిక్షణ ఇవ్వడం చేస్తోంది. కత్తి, కొడవలి, ఇనుప రాడ్ల తో ఎలా దాడులు చేయాలో శిక్షణ లో నేర్పిస్తుంది PFI. ఉగ్రవాద సాహిత్యంతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది NIA. సున్నిత ప్రాంతంలో ఏవిధంగా దాడులు చేయాలో PFI శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. దేశ వ్యాప్తంగా దాడులు చేసి పలువురిని విచారించింది NIA. PFI కేసులో దర్యాప్తు కొనసాగుతుందని NIA వెల్లడించింది. ఇప్పటికే PFI సంస్థ ను భారత ప్రభుత్వం నిషేధించింది.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్