Viral video: తన భార్యకు మొబైల్ ఫోన్ కొనిస్తున్న వ్యక్తిపై ‘‘గర్ల్ ఫ్రెండ్’’ దాడి చేసిన సంఘటన వైరల్‌గా మారింది. బీహార్ చాప్రాలో ఒక వ్యక్తి తనను మోసం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న అతడి గర్ల్ ఫ్రెండ్, మొబైల్ షాపులోనే అతడిని పట్టుకుని చితకబాదింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.