Chandrayaan-1: భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై నీటి ఆనవాళ్లను తొలిసారిగా భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 గుర్తించింది. అయితే ఈ నీరు చంద్రుడిపైకి ఎలా చేరిందనేది ప్రశ్నగా మిగిలింది. అయితే చంద్రయాన్-1 డేటా ఆధారంగా పరిశోధనలు చేపట్టారు. ఇందులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై నీటికి భూమి కారణమని తెలిసింది. హవాయ్ యూనివర్సిటీ పరిశోధకుల పరిశోధనల్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో నేడు ప్రపంచం మొత్తం భారతీయ శాస్త్రవేత్తలను కొనియాడుతోంది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించి తదుపరి మిషన్‌ను ప్రోత్సహించారు.