అప్పులు తీర్చలేకపోయిన రైతులను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమ వడ్డీ వ్యాపారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో అప్పులు ఇచ్చి, చివరికి వాటిని తీర్చేందుకు రైతులు తమ కిడ్నీలను అమ్ముకునే పరిస్థితి వరకు తీసుకువచ్చిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు చట్టపరమైన రక్షణతో పాటు…