తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పటల్ కు తరలించారు.
సమస్యాత్మక వార్డుల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి డీఎస్పీ మనోహరాచ్చారి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రౌడీ షీటర్స్ పై నిఘా పెంచామని చెప్పారు. టపాసులు అమ్మడం, కొనడం నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
ఏపీ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
తాడిపత్రిలో రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఎనిమిది గంటలుగా అల్లర్ల ఘటనప్తె నమోద్తెయిన కేసుల వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను సంబంధించి ఎస్ హెచ్ ఓ లను అడిగి తెలుసుకుంటున్నారు.
తిరుపతిలో సిట్ బృందం చేపట్టిన విచారణ కొనసాగుతోంది. మరో రెండు, మూడు గంటలు పాటు విచారణ సాగే అవకాశం ఉంది. దాడి ఘటనపై పలు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను, దాడి సమయంలోని తీసినా వీడియోలు సిట్ పరిశీలిస్తోంది.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పద్మావతి వర్శిటి స్టాంగ్ రూమ్ దగ్గుర పోలీసులు భారీ భద్రతతో పాటు 144 సెక్షన్ విధించారు. లివర్తి నానిపై దాడికి పాల్పడింది మొత్తం 30 మంది అని పోలీసులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు ముగ్గురుని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారంతా పరారీలో ఉన�
ఏపీలో పోలింగ్ తర్వాత కూడా దాడు ఆగడం లేదు. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి జిల్లా స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది.
Software Couple: విడిపోయిన జంటను పుట్టినరోజు ఏకం చేసింది.. పుట్టినరోజు ఏంటి..? జంటను ఏకం చేయడం ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అయితే.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఓ జంట విడిపోయింది.. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్నపాటి గొడవతో ఆ పంచాయతీ కాస్తా.. చంద్రగిరి పోలీస్ స్టేషన్కు చేరింది.. ఆ జంటను పోలీస్ స్టేషన్కు పిలిచిన చం