ఒకప్పుటి రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నా.. ఆ వైరం పోదు. కలిసి సాగలేరు. వెళ్దామన్నా ఇగోలు.. పాత గొడవలు అడ్డొస్తాయి. గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య అదే జరుగుతోందట. పరస్పరం పైచెయ్యి సాధించేందుకు వారు వేయని ఎత్తుగడలు లేవంటున్నారు పార్టీ నాయకులు. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కథా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్‌గానే ఉంటాయి. జిల్లాలోని కీలక నేతలంతా నివాసం ఉండేది ఇక్కడే. అందుకే…
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారట ఆ మాజీ పోలీస్ అధికారి. ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న ఆయన… ‘మద్దాలి నిన్నొదల’ అని వెంట పడుతున్నారు. ఎమ్మెల్యేకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారట. ఇద్దరూ ఒకేపార్టీలో.. ఒకే గొడుకు కింద ఉన్నా.. రాజకీయ ఎత్తుగడలు గుంటూరు మిర్చిలా ఘాటెక్కిస్తున్నాయట. వారెవరో? ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. మద్దాలిని ముప్పుతిప్పలు పెడుతున్న ఏసురత్నం! గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా…