Social Media: ప్రస్తుతం రాజకీయ పార్టీ కార్యక్రమాలకు అయినా, సినిమా ప్రమోషన్‌లకు అయినా, వ్యాపారానికి సంబంధించిన ప్రమోషన్‌లకు అయినా సోషల్ మీడియా ప్రధానంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఫాలోవర్ల విషయం కూడా ఆసక్తిరేపుతోంది. ఈ అంశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఒకరితో ఒకరు పోటీ పడి ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి రాజకీయ నేతలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడుతున్నప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం ట్విటర్‌పైనే పెడుతున్నారు. ఏపీకి సంబంధించి…
Christamas: ఆదివారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ప్రజలకు సీఎం జగన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం వంటి వాటిని క్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి అందించించిన గొప్ప సందేశాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుడి ఆశీస్సులు, దీవెనలు లభించాలని జగన్ ఆకాంక్షించారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ఏసు ఈ ప్రపంచానికి అందించారని…
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఆయనకు జవసత్వాలు అయిపోయాయని.. అందుకే వాటిని నిలుపుకోవడానికి పర్యటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మకమైన అంశాలు చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారని.. కానీ అసత్యాలు చెప్తే నమ్మరనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజాం, బొబ్బిలి సభలలో చంద్రబాబు అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రి బొత్స మండిపడ్డారు. బొబ్బిలి రైతు…
Gangula Kamalakar: సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా అందరూ పోరాటం చేసారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సంపద పెరిగిందని అన్నారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని అన్నారు. ఉమ్మడి రాజధాని విషయంలో 10 ఏండ్ల గడువుందని పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వై.ఎస్. బిడ్డ వెరైటీ ముసుగుతో ఇక్కడకొచ్చిందని ఎద్దేవ చేశారు.…
తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. ఖమ్మం జిల్లాలో టీడీపీ బహిరంగసభపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో ప్రజలకు సేవ చేయాలని ఉంటే మంచిది.. ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదన్న ఆయన.. రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని మండిపడ్డారు.. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తెలంగాణకు వెళ్లాడు.. కానీ, ఏం చేయాలో కూడా చంద్రబాబుకు స్పష్టత లేదన్నారు..…
తెలంగాణ నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్ర బాబు అంటూ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర బాబు ఆంధ్ర ప్రజల చేతుల్లో చిత్కరంకు గురి ఆయ్యారని పేర్కొన్నారు. చంద్ర బాబు పాలన బాగా లేదని ఎపి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు.
DL Ravindra Reddy: కడప జిల్లా వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే అవినీతితో పాలన మొదలుపెట్టారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే అని, ఏపీని చంద్రబాబు తప్ప మరొకరు కాపాడలేరని అభిప్రాయపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేమని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని డీఎల్ రవీంద్రారెడ్డి ఆకాంక్షించారు.…