ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారాయణస్వామి బుద్ధి, జ్ఞానం లేకుండా మతిలేని వాడిలా మాట్లాడాడు అని మాజీ మంత్రి నన్నపనేని రాజ కుమారి విమర్శలు చేశారు. ఆయనతో ఎవరు మాట్లాడించారో ప్రజలకు తెలుసు.. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలను ఉద్దేశించి అనరాని మాటలనేవారు అసలు మనుషులేనా అన్న సందేహం కలుగుతోంది.
సోమవారం నుంచి శనివారం వరకు రోజుకి రెండు లీగల్ ములఖాత్‌లు ఇస్తూ వచ్చారు జైలు అధికారులు.. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో.. చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల సంఖ్య ఒకటికి పడిపోయింది..
టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు రెండూ కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే ప్రకటించారు.
మధు ఖోడా, సిబు సోరేన్, జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు విషయంలో కూడా అంతే.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసింది.
రాజమండ్రి సెంట్రల్ జైలులోని చంద్రబాబు రిమాండ్ నేటికి 37వ రోజుకు చేరుకుంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు రిమాండ్ లో ఉన్న స్నేహా బ్లాక్ లో ఏసీ ఏర్పాటుకు సెంట్రల్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడం తప్పా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను వ్యతిరేకమని సోషల్ మీడియాలో తనపై ట్రోల్ చేస్తున్నారని ఆయన తెలిపారు.