టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పేరుతో సర్క్యూరేట్ అవుతున్న లెటర్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. చంద్రబాబు పేరుతో సర్కులేట్ అవుతున్న లెటర్ జైలు నుండి వచ్చింది కాదు అని తెలిపారు.
చంద్రబాబు లేఖకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ లేఖ రాశారు. 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా.. నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ మీరు ఉత్తరం రాశారు అంటూ సెటైర్ వేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కా్మ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే, చంద్రబాబు నాయుడు జైలు నుంచి నా ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ లేఖ విడుదల చేశారు.
తెలుగు జాతి ఆస్తి.. దేశం ప్రపంచం నలుమూలల.. తెలిసే విధంగా మన పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.. చంద్రబాబు నాయుడు మీద దొంగ కేసులను, సంబంధం లేనటువంటి కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఇప్పుడు లోకేశ్ కూడా ఏడుస్తున్నాడు.. చంద్రబాబు ఏడుపు నాటకం, లోకేశ్ ఏడుపు ఆవేదన అనిపిస్తుంది.. తన లాంటి చేత గాని పప్పుకు కూడా మూడు శాఖలు ఇచ్చిన తన తండ్రి చంద్రబాబును జైల్లో వేశారని లోకేశ్ ఆవేదన చెందుతున్న పరిస్థితి అని ఆయన అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. రాజకీయ విలువలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.