కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలులో ఆంక్షలు పెడుతున్నారు
వేలం పాట మాదిరిగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా కే.లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలులో ఆంక్షలు పెడుతున్నారని, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే మేలు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారన్నారు లక్ష్మణ్. ఉచిత హామీలతో మోసపోయామని కర్ణాటక ప్రజలు గుర్తించారని, కర్ణాటకలో నాణ్యమైన కరెంట్ రెండు గంటలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు.
అంతేకాకుండా.. ‘నాడు కర్ణాటక బీజేపీ ప్రభుత్వం 12 గంటల విద్యుత్ ఇచ్చాం. రైతులకు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కరెంట్ చార్జీలు పెంచారు… వెయ్యి రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు మూడు వేలకు పెంచారు. అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే కాంగ్రెస్ మాట మార్చింది. కర్ణాటక లో 65 యేళ్లు దాటిన వారికే వృధ్యాప్య పింఛన్లు ఇస్తున్నారు. చేయూత పథకాల పేరుతో చెయ్యి ఇస్తారు జాగ్రత్త. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హామీలకు మోసపోవద్దు. ఈ నెల7న మోడీ సభను విజయవంతం చేయాలని పిలుపు. ఉచిత పథకాలపై లక్ష్మణ్ కామెంట్. కూర్చొని తింటే కొండలు అయినా కరిగిపోతాయి.. జనసేన ఎన్డీఏ భాగస్వామి.. జనసేన తో పొత్తు ఖరారు అయ్యింది.. రెండు రాష్ట్రాల్లో జనసేనతో కలిసిపోతాం.’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
పేదలంటే చంద్రబాబుకు కోపం, చిరాకు..
శ్రీకాకుళం జిల్లాలో పలాస సామజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా వైసీపీ బహిరంగ సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్ బాగుచేయాలని అలొచన రాలేదు.. పేదలంటే చంద్రబాబు నాయుడికి కోపం, చిరాకు వస్తుందని ఆయన విమర్శించారు. మత్స్యకారుల తొక్కతీస్తాం, తోలుతీస్తామని గతంలో చంద్రబాబు వార్నాంగ్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నాయిబ్రాహ్మణుల తోకలు కట్ చేస్తామన్నారు.. బీసీలు జడ్జిలుగా పనికి రారని లెటర్ రాసాడు అని మంత్రి సీదిరి అప్పల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జడ్జీలు కావాలంటే నారా చంద్రబాబు నాయుడి కులంలో పుట్టాలంట అని మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహ వ్యక్తం చేశారు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు.. విద్యా, వైద్యం కార్పొరేట్ మయం చేసి బాబు తన వాళ్లకు కట్టబెట్టుకున్నారు.. ఉద్దానం గోష విని , కిడ్ని జబ్బులతో చెనిపోకూడదని అలోచన చెస్తున్నారు.. 200 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ హాస్పటిల్ కట్టిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. 700 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి కులాయి ద్వారా త్రాగు నీరు అందించే ఏర్పాటు చేస్తున్నారు.. కింజరాపు వాళ్లు జిల్లాకు ఏం చేసారో చెసారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. మూల పేటలో వలసల నిర్మూలనకు పోర్ట్ నిర్మిస్తున్నారు అని మంత్రి సీదిరి అప్పల రాజు వెల్లడించారు. ప్రజల కోసం సీఎం జగన్ ఇన్ని చేస్తున్నారు.. ఆయనకు ఓటు వేసి గెలిపించుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు.
ప్రిన్సిపాల్ కాదు కీచకుడు..50 మంది బాలికలపై లైంగిక వేధింపులు..
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే తప్పుడు పనులకు పాల్పడ్డాడు. ఉన్న హోదాలో ఉన్న ప్రిన్సిపాల్ కీచకుడిగా మారాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలోని జింద్ జిల్లాలో చోటు చేసుకుంది. 50 మందికి పైగా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు. నిందితుడైన వ్యక్తిని శనివారం అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. ఈ కేసును విచారించేందుకు డీఎస్పీ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
పేదల కోసం జగన్ ఆలోచిస్తే.. ధనవంతులు, దోపిడిదారులపై చంద్రబాబు దృష్టి
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఎలాంటి ఉద్యమాలు లెకుండానే దీర్ఘకాలిక సమష్యలకు పరిస్కారం చేశాం.. అవినీతి లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం.. ద్రబాబు కూడా అవినీతి చేసామని మాట్లాడటం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు డబ్బు ఇస్తే దుర్వినియోగం అయిపొతుందన్నారు.. పరిస్దితులు చూసి తాను అధికారంలొకి వస్తే తాను డబ్బులు ఇస్తామంటున్నాడు అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు వ్యాఖ్యనించారు.
సీఎం జగన్ పేదల కోసం ఆలోచిస్తే, చంద్రబాబు దృష్టి అంతా ధనవంతులు, దోపిడిదారులపై ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. పేద, ధనిక మద్య అంతరాలను తొలగించాలనే మార్పు జగన్ చేస్తున్నారు.. దేశంలో ఇతర ప్రాంతాలు కూడా అనుసరించాల్సిన పాలన ఇస్తున్నాం.. జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్దికి సూచికలు.. ఇల్లు లేఖ అవస్థలు పడుతున్న వారికి ఇవ్వడం అభివృద్ది కాదా?.. రాజధాని మార్కెట్ ని క్రియేట్ చేసి , తనవాళ్లకు ప్రయొజనం చెయాలని బాబు తాపత్రయపడ్డారు అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు చెప్పుకొచ్చారు.
బర్త్ డే రోజే వరల్డ్ రికార్డు.. 49వ సెంచరీ చేసిన కోహ్లీ
ప్రపంచ కప్లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ తన బర్త్ డే రోజున సెంచరీ చేసి.. తన ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చాడు. 119 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీకి ఈ సెంచరీ ఓవరాల్ గా 78 వ అంతర్జాతీయ సెంచరీ. ఇదిలా ఉంటే.. సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లీ 277 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో చివరి వరకు ఆడి 49వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ 49వ సెంచరీ పూర్తి చేశాడు. అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లీ, సచిన్ తర్వాత రోహిత్(31), రికీ పాంటింగ్(30) ఉన్నారు.
తెలంగాణకు వస్తున్న మోడీ ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలి
ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ఏర్పాటు అయ్యాక రెండు సార్లు కేంద్రానికి తీర్మానం చేసి పంపించామన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన ఇందిరా పార్క్ వద్ద మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో ఎస్సీ వర్గీకరణ పై తాత్సారం చేస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణకు వస్తున్న మోడీ దీనిపై సమాధానం చెప్పి రావాలన్నారు మంత్రి హరీష్ రావు. మాదిగల పై మోడీకి చిత్తశుద్ది లేదని, కేసీఆర్ ఎన్నో సార్లు అడిగినా మోడీ పట్టించుకోవడం లేదన్నారు. తీర్మానం ప్రతిని ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి చేత మోడీకి ఇచ్చామని, కానీ మోడీ పట్టించుకోలేదన్నారు.
ఎంపీలో మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు.. కోవిడ్ లాక్‌డౌన్ ఆలస్యం చేశారు..
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోవిడ్ మహమ్మారి లాక్‌డౌన్‌ని ఆలస్యం చేశారని బీజేపీై ఆరోపణలు గుప్పించారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 2020లో మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత సీఎం శివరాజ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
2020, మార్చి కోవిడ్-19 మహమ్మారి మూలంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అయితే సరైన సమయంలో కేంద్రంలోని బీజేపీ లాక్ డౌన్ విధించలేదని, మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వం పడిపోతుందని నిర్ధారించడానికి 10 రోజలు సమయం ఇచ్చారని, ఇది కుట్రని జైరాం రమేష్ ఆరోపించారు.
సీఎంగా జగన్ మళ్లీ వస్తేనే భవిష్యత్ ఉంటుంది..
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చదువు ద్వారా పేదరికం రూపు మాపడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. అమ్మవడే కాదు అన్ని అంశాలలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.. మాకు ఇద్దరు మామలు, చందమామ, జగన్ మామ అంటున్నారు పిల్లలు అని ఆయన చెప్పుకొచ్చారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు అని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు.
ఆరోగ్యశ్రీ , జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారు అని స్పీకర్ తమ్మినేని సీతారం వెల్లడించారు. నేను పేదల పక్షాన ఉంటానని, మేలు చేస్తేనే ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు అని ఆయన తెలిపారు. సీఎంగా మళ్లీ జగన్ ని చేస్తేనే భవిష్యత్ బాగుంటుందని వ్యాఖ్యనించారు. చారిత్రక అవసరం ఉంది.. అలా కాకుంటే దేశం కుడా క్షమించదు అని ఆయన పేర్కొన్నారు. సామాజిక సాధికార యాత్రనే కాదు స్వాభిమాన యాత్ర కూడా అని స్పీకర్ తమ్మినేని సీతారం చెప్పారు.
అభివృద్ధి చేసిన సీఎం జగన్ ను గుర్తు పెట్టుకోవాలి..
విజయవాడలో 15 అడుగుల వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొన్నారు. వన్ టౌన్ స్వాతి రోడ్డులో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక, స్వాతి రోడ్డు మీద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో విజయవాడ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గంలో ఖైదీ నం.7691 సందు సందుల్లో కార్పొరేటర్ ఎలక్షన్లలో తిరిగారు.. చంద్రబాబు 24 గంటలు ఇక్కడ తిరిగితే.. పెద్దిరెడ్డి 4 గంటలు మాత్రమే తిరిగి కార్పొరేటర్లను గెలిపించారు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు సీఎం, ఎంపీ నాని, పారిపోయిన జలీల్ ఖాన్, దద్దమ్మ దేవినేని ఉమ ఉండి కూడా వన్ ఔన్ అభివృద్ధి కాలేదు అంటూ వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ ఆహ్వానించదగినది.. అభివృద్ధి చేసిన సీఎం జగన్ ను గుర్తు పెట్టుకోవాలి అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దేవినేని అవినాష్, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్.. పశ్చిమ నియోజకచర్గానికి శాశ్వత ఎమ్మెల్యేగా వెలంపల్లి ఉంటారు అని ఆయన తెలిపారు.
వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు
వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయేలా ప్రజలు చేయాలి.. పేద ప్రజల దేవుడు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం.. సీఎం జగన్ ని గొప్ప నేతను చేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మా నడకకి, మా గెలుపుకి మూల స్తంభం పెద్దిరెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ అద్భుతం అని ఆయన కొనియాడారు. కాంస్య విగ్రహం ఆవిష్కరణ అద్భుతంగా ఉందని మంత్రి జోగి రమేష్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపం వల్ల ప్రాజెక్టు కుంగింది
షబ్బీర్ అలీ నివాసంలో అర్బన్ కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీని అర్బన్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు అర్బన్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు లక్ష్యంగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కామారెడ్డి వదిలి నిజమాబాద్ రావడం బాధగా ఉన్న.. మీ అభిమానం ఆనందాన్నిస్తుందన్నారు. కాళేశ్వరం లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపం వల్ల ప్రాజెక్టు కుంగిందని, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు షబ్బీర్ అలీ.
భారీ విజయాన్ని అందుకున్న భారత్.. సౌతాఫ్రికాపై సూపర్ విక్టరీ
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 243 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లలో అత్యధికంగా రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో భారత్.. వరల్డ్ కప్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో అన్నింటిలో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ శతకంతో మెరువగా, శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఈ క్రమంలో టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చెమటలు పట్టించారు. ఆరంభం నుంచే బౌలింగ్ విజృంభణతో విరుచుకుపడి క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లుగా వెనక్కి పెవిలియన్ కు పంపించారు. టీమిండియా బౌలర్ల విజృంభణ ముందు సౌతాఫ్రికా బ్యాటర్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల స్కోరు దాటలేదు. ఇక.. ఈ మ్యాచ్ లో స్పిన్నర్ రవీంద్ర జడేజా అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు సాధించగా.. స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 2 వికెట్లు సాధించాడు. మహ్మద్ సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది. ఇక ఇండియా తర్వాతి మ్యాచ్ నెదర్లాండ్స్ తో ఆడనుంది.