వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు..
అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యే శంకరనారాయణ, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్ కు ఉందని అన్నారు. వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు భాగస్వామ్యం కల్పించిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఎంపీ విమర్శించారు.
కేశినేని భవన్కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగింపు..
బెజవాడలో కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగించారు. టీడీపీ, చంద్రబాబు ఇతర నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తీసేశారు సిబ్బంది. కేవలం.. కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. కేశినేని పార్టీ మారుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ, చంద్రబాబు ఫోటోలతో ఉన్న ఫెక్లీలను తొలగించారు.
మేడిగడ్డ అంశంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగిపోవడం అంశంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్ గా స్పందించిందన్నారు. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మేడిగడ్డ వద్ద పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ అధికారులతో ఇచ్చిందన్నారు. మేడిగడ్డలో జరిగిన పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత జ్యూడిషియల్ విచారణ జరుపుతామని ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు క్యాబినెట్ సమావేశంలో తీర్మాణం చేసిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసారన్నారు. ఈ రోజు విజిలెన్స్ దాడులు నీటి పారుదల శాఖ కార్యాలయాలలో తనికీలతో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు.
ఈ ఫార్ములా ట్రై పార్టీ రేసింగ్‌ను.. బై పార్టీ రేసింగ్‌గా మార్చారు..
జరిగిన ఆర్థిక అరాచకత్వం – కొద్ది మంది ప్రయోజనాలు, ప్రాపకం కోసం చేసిన వాటిని సరిచేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ – రేసింగ్ వల్ల ఒకరు టికెట్లు అమ్ముకున్నారు, మరొకరు రేసింగ్ చేసుకున్నారు మరి ఇన్ఫ్రాసట్రక్చర్ ఇచ్చిన రాష్ట్రానికి ఆదాయం సున్నా అన్నారు భట్టి. ఈ ఫార్ములా ట్రై పార్టీ రేసింగ్ ను – బై పార్టీ రేసింగ్ గా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. టికెట్లు అమ్మేవాళ్లు, రేసింగ్ వాళ్ళు కలిపి 110 కోట్లు కట్టాలి కానీ కట్టలేదని, రెండో అగ్రిమెంట్ లో స్టేట్ గవర్నమెంట్ టే అనుమతులు ఇప్పించాలి, తిరిగి డబ్బులు కట్టాలన్నారు భట్టి విక్రమార్క.
వైసీపీ రాతియుగం కావాలా.. టీడీపీ స్వర్ణయుగం కావాలా..
టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ‘రా కదలిరా’ సభలో పాల్గొన్నారు. ఈ సభకు భారీగా కార్యకర్తలు, జనాలు రావడంతో.. చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ జనాన్ని చూసి తాడేపల్లి పిల్లి వణికిపోతోందని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలు పివి నరసింహారావును పార్లమెంట్ కి పంపితే ఆర్థిక సంస్కరణలు అమలు చేశారని తెలిపారు. పివి నరసింహారావు దేశానికి దశ దిశ చూపించారని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా.. ఎన్టీఆర్ జనవరి 9న అధికారం చేపడితే, ఇదే రోజు ఆళ్లగడ్డలో సభ నిర్వహించుకుంటున్నామన్నారు. మరోవైపు.. ఐదేళ్ల వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. వైసీపీ రాతియుగం కావాలా.. టీడీపీ స్వర్ణయుగం కావాలా అని చంద్రబాబు జనాలను ప్రశ్నించారు.
జనవరి 22న యూపీలో విద్యాసంస్థలకు సెలవు.. మద్యం అమ్మకాలు బంద్
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు. జనవరి 22న అన్ని ప్రభుత్వ భవనాలను అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.
సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీ
తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ ఏఎం రిజ్వీ తో కలిసి ఆ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సోలార్ విద్యుత్ ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి దశ దిశ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు ఈ పథకంపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆదేశాలు ఇచ్చారు. గృహ కమర్షియల్ ఆఫీసు భవనాలపై సోలార్ సిస్టం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అన్ని లెక్క రాసుకుంటున్నాం.. ఎవరిని వదిలిపెట్టేది లేదు..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ‘రా కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సభలో భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో రాక్షసులు భయపడేలా పాలన ఉందని ఆరోపించారు. హిట్లర్ కూడా ఈ పాలన చూసి భయపడతారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పని లేదని భూమా అఖిలప్రియ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో గూండాల్ని తయారు చేశారని మండిపడ్డారు. గుండాలను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని అఖిలప్రియా దుయ్యబట్టారు.
సంక్రాంతి స్పెషల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
పరేడ్ గ్రౌండ్లో ఈనెల 13,14,15 కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఆబ్కారీ & టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సక్రాంతి పండుగను పురస్కరించుకుని ఫెస్టివల్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా ఫెస్టివల్ ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, ప్రపంచంలో నీ చాలా దేశాల నుండి ఫెస్టివల్ లో పాల్గొంటారని తెలిపారు. 15 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నానన్నారు. 400 రకాల స్వీట్ ఈ ఫెస్టివల్ లో ఉంటాయని, ప్రపంచం ప్రజలను కలిపే విధంగా ఫెస్టివల్ ఉంటుందన్నారు. జిల్లా, మండల కేంద్రాలకు విస్తరింప చేయాలని భావిస్తున్నామని, తెలంగాణ, తెలుగు కళలకు పూర్వవైభవం చాటేలా ప్రభుత్వం కార్యక్రమాలు ఉంటాయన్నారు.
“మిడ్ డే మీల్స్ స్కీమ్” పేరుతో బీఆర్ఎస్ నేత భారీ స్కాం
తెలంగాణలో “మిడ్ డే మీల్స్ స్కీమ్” పేరుతో బీఆర్ఎస్ నేత అరవింద శెట్టి భారీ స్కాంకు పాల్పడినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు ఉపయోగించి అరవింద్ నాలుగు కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ఆగ్రో కమాడిటీస్ సప్లై పేరుతో పలువురు వ్యాపారులను అరవింద్ మోసం చేసినట్లు పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే.. 2021 నుండి 4 కోట్ల రూపాయలు అరవింద్ వసూలు చేసినట్లు సమాచారం. మిడ్ డే మీల్స్ స్కీమ్ ప్రాజెక్టు ఓకే అయింది అంటూ బిజినెస్ మాన్స్‌ను అరవింద్ నమ్మిoచారు.