టీడీపీ అధినేత నారా చంద్రబాబు జిల్లాల పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పలు జిల్లాలలో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న తొలి మహానాడుతో చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ విధ్వంసకర పాలనను ఎండగడుతూ ప్రజల భవిష్యత్‌కు భరోసా…