ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. నేడు దేశరాజధాని ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు విజయవాడకు బయల్దేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎంను టీడీపీ నేతలు కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా ఐదుగురు కేంద్ర మంత్రులను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. వారి దృష్టికి పలు ముఖ్యమైన అంశాలను తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్‌లో…