CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ( నవంబర్ 19న) కడప జిల్లాలో పర్యటించనున్నారు. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్‌లో పెండ్లిమర్రికి చేరుకోనున్న సీఎం.. అనంతరం వెల్లటూరులోని మన గ్రోమోర్ ఎరువుల సెంటర్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.40 గంటలకు పెండ్లిమర్రిలో నిర్వహించే ప్రజావేదిక ప్రోగ్రాంలో చంద్రబాబు పాల్గొంటారు.
Read Also: Minister Nadendla: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది..
ఇక, బుధవారం నాడు సాయంత్రం 4.20 గంటలకు చిన్నదొరసారి పల్లెలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు. అలాగే, సాయంత్రం 5.15 గంటలకు వెల్లటూరులో పార్టీ స్థానిక నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6.40 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడకు తిరిగి పయనం కానున్నారు సీఎం చంద్రబాబు.