CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రామాల్లో వాతావరణం పూర్తిగా మారిందని, ప్రజలు ఉత్సాహంగా స్వగ్రామాలకు వచ్చి పండుగలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు గ్రామాలకు వెళ్లాలంటే భయం ఉండేదని, కానీ ఈ ఏడాది భోగి–సంక్రాంతి పండుగలను ప్రజలు ఎంతో ఆనందంగా తమ ఊళ్లలో జరుపుకున్నారని సీఎం చెప్పారు. జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదని, గ్రామాలతో ఉన్న అనుబంధమే మన సంస్కృతి అని చంద్రబాబు…