Telugu Mahasabhalu 2026: మూడో ప్రపంచ తెలుగు మహాసభలు 2026కు గుంటూరులో ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న మహాసభలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చనతో ప్రారంభమయ్యే ఈ వేడుకను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్ రవీంద్ర కలిసి ప్రారంభించబోతున్నారు.. ప్రధాన వేదికతో పాటు…