ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశం వాయిదా పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే… నేడు మధ్యాహ్నం నిర్వహించాల్సిన కేబినెట్ భేటీ అర్థాంతరంగా వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్స్‌ల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తోంది.…