ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు దీపావళి వేడుకలు చేసుకున్నారు. పండగ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇంట్లో పూజ చేసి దీపాలు వెలిగించారు. ఆపై సతీమణితో కలిసి కాకరవత్తులు వెలిగించారు. చెడుపై మంచి సాధించిన విజయం దీపావళి అని సీఎం అన్నారు. చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం దీపావళి వేడుకలకు సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి.