దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాందినీ చౌక్‌లోని మార్వాడీ కత్రాలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మరోవైపు.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు బృందాలు కూడా ఘటనా స్థలంలో మోహరించారు.