చంఢీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది.
పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓ బాలిక తన హాస్టల్ మేట్స్ ప్రైవేట్ వీడియోలను ఓ అబ్బాయి సాయంతో ఆన్‌లైన్‌లో లీక్ చేయడంతో పంజాబ్‌లోని మొహాలీలోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో భారీ నిరసనలు చెలరేగాయి.