భారత ఫెన్సర్ భవానీ దేవి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తొలిసారిగా మెడల్ సాధించిన తొలి ఇండియన్ ఫెన్సర్‌గా భవానీ చరిత్రకెక్కింది. చైనాలో జరిగిన ఈ పోటీలో మహిళల సాబెర్ విభాగంలో ఆమె కాంస్య పతకం గెలుపొందింది. సోమవారం హోరాహోరీగా సాగిన సెమీస్ లో భవాని 14-15 తేడాతో జేనబ్ దాయిబెకోవా(ఉబ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడింది.