మనీలాండరింగ్ కేసులో బుధవారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.
ఝార్ఖండ్‌లో మరో రాజకీయ సంక్షోభం తలెత్తబోతుందా? రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? లేదంటే అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కమలం వ్యూహం పన్నుతుందా? రాజ్‌భవన్ కేంద్రంగా అసలేం జరుగుతోంది.