పోడు రైతుల చలో ప్రగతిభవన్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజామున సర్పంచ్ మడకం స్వరూప సహా గ్రామస్థులను అరెస్ట్ చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోరుతూ చలో ప్రగతిభవన్కు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే, ఎంపీపీ తక్షణమే రాజీనామాలు చేయాలని పోడు రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న గతంలో లాగే పోడు వ్యవసాయం చేసేందుకు గిరిజనులు సన్నద్ధం కావడంతో.. అధికారులు వీరిని అడ్డుకుకోవడంతో.. గిరిజనులు, అధికారులు మధ్య…