ఓటు అనేది ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటింది. ఓటర్లు దీనిని ఎలా వాడుకుంటే అదే రిజల్ట్ వస్తుంది. ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్ బంగారుమయంగా ఉంటుంది. అలాకాకుండా ఓటును నోటుకో, మద్యానికో అమ్ముకుంటే కష్టాలుపడక తప్పదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా రాజకీయాలు భ్రష్టుపట్టిపోవడంతో శాసనసభ, పార్లమెంట్ ఉభయ సభల్లోకి క్రిమినల్ రికార్డులున్న వాళ్లే ఎక్కువగా అడుగు పెడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి పెనుముప్పును తెచ్చే పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నూటికి…