పేదలకు దక్కాల్సిన ఇళ్లను కూడా వైసీపీ నేతలు అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3.16లక్షల ఇళ్ళు కట్టి 2.62లక్షలు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచిందని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఇచ్చి పేదలకు ఏటా 5లక్షల ఇళ్లు కడతానని జగన్ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, గత 3 ఏళ్లలో 15లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా జగన్ కేవలం 5…