నామినేటెడ్ పదవుల కోసం చాలా కాలంగా ఆశావహులు ఎదురుచూస్తున్నారు.. అయితే, అందులో కొంతమందికి శుభవార్త చెప్పారు టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు.. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు.…