Group 1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. గ్రూపు-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ 20 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం కోర్టు విచారణ ప్రారంభించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు నియామక పత్రాలు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. ఇటీవల,…