ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత ఎన్నికల ప్రక్రియ విధానాన్ని కొనియాడారు. కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ ‘భారతదేశంలో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు?’ అనే హెడ్‌లైన్‌తో ప్రచురించి ఓ వార్తా కథనాన్ని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.