కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని తెలిపారు. ఈసారి ఆన్ లైన్లో నామినేషన్ ఫారంలు ఫిలప్ చేసుకోవచ్చుని తెలిపింది. కానీ ప్రింటవుట్ తీసుకుని ఆర్వోకు ఫిజికల్ గా అందించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి…