కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వరిధాన్యం విషయంలో యుద్ధం సాగుతూనే వుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వ్యతిరేకంగా లోకసభలో ప్రివిలైజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటు ను, దేశ ప్రజలని, రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పెట్టించారని సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్) నోటీసులో పేర్కొన్నారు. నోటీసును స్పీకర్ ఓంబిర్లాకు అందజేశారు టీఆర్ ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు,కొత్త ప్రభాకర్…